నాని ‘హిట్ 3’.! మామూలుగా వుండదు మరి.!

- September 14, 2024 , by Maagulf
నాని ‘హిట్ 3’.! మామూలుగా వుండదు మరి.!

హిట్లు మీద హిట్లు కొట్టుకుంటూ పోతున్నాడు నాని. లేటెస్ట్‌గా ‘సరిపోదా శనివారం’ సినిమాతో మరో తాజా హిట్ తన ఖాతాలో వేసేసుకున్న సంగతి తెలిసిందే నేచురల్ స్టార్ నాని.
ఈ సినిమా మేనియా ఇంకా అలాగే వుంది.  ధియేటర్లలో ఈ సినిమాకి మంచి ఆదరణే దక్కుతోంది. త్వరలోనే ఓటీటీ రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు.
కాగా, తన హోమ్ బ్యానర్ మూవీ ‘హిట్ 3’కి రంగం సిద్ధం చేసేశాడు ఈ లోపు నాని. ఈ సినిమా ఆల్రెడీ నాని లేకుండా కొన్ని సీన్లు షూటింగ్ చేసేశారు. ఇక, ఇప్పుడు ‘సరిపోదా శనివారం’ పనులు చక్కబెట్టేసి నాని కూడా షూటింగ్‌లో పాల్గొనడానికి సిద్ధమయ్యాడు.
‘హిట్’ ప్రాంఛైజీలుగా ఫస్ట్ కేస్, సెకండ్ కేస్ అంటూ రెండు సినిమాలు ఈ సిరీస్‌లో సూపర్ హిట్ అయ్యాయ్. మొదటి కేస్‌లో విశ్వక్ సేన్, రెండో కేస్‌లో అడవి శేష్ హీరోలుగా నటించగా, మూడో కేస్ కోసం నానినే హీరోయిజం చూపించబోతున్నాడు.
ఆల్రెడీ ఈ విషయం సెకండ్ కేస్ క్లైమాక్స్‌లో హింట్ ఇచ్చేశారు. అర్జున్ సర్కార్ అనే పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నాని ఇంట్రడక్షన్ కూడా జరిగింది.
అర్జున్ సర్కార్ తన పవర్‌తో సాల్వ్ చేయబోయే కేస్ 3 ఎలా వుండబోతోందనేది వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో తెలిసిపోనుంది. ఫస్ట్ టైమ్ పోలీసాఫీసర్ పాత్రలో నాని కనిపించబోతున్నాడు ఈ సినిమా కోసం. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందబోయే ఈ సినిమాని వాల్ పోస్టర్ బ్యానర్‌లో నాని నిర్మిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com