స్కూల్ స్టడీ బుక్‌లెట్ల అమ్మకాలను నిషేధించిన విద్యా మంత్రిత్వ శాఖ..!!

- September 14, 2024 , by Maagulf
స్కూల్ స్టడీ బుక్‌లెట్ల అమ్మకాలను నిషేధించిన విద్యా మంత్రిత్వ శాఖ..!!

మనామా: కొన్ని దుకాణాలు లేదా స్టేషనరీ అవుట్‌లెట్‌ల నుండి తల్లిదండ్రులు స్టడీ బుక్‌లెట్లను కొనుగోలు చేయాలని విద్యా మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలను జారీ చేసింది. ఈ మెటీరియల్‌లను ముద్రించడం, విక్రయించడం చేయకుండా పాఠశాలలపై నిషేధం విధించారు. రివిజన్ గైడ్‌లను రూపొందించే ఉపాధ్యాయులు తప్పనిసరిగా పాఠశాలలో వాటిని ప్రింట్ చేసి ఉచితంగా పంపిణీ చేయాలని సూచించింది.  ఈ బుక్‌లెట్‌లు రోజువారీ చదువుకు సంబంధం లేవని, పూర్తిగా ఐచ్ఛికమని తెలిపింది. పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్‌లు పూర్తి పాఠ్యాంశాలపై ఆధారపడే విద్యార్థుల చదువులపై వీటి ప్రభావం ఉండదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అలాగే నిబంధనలు పాటించని స్టేషనరీ షాపులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  స్టడీ బుక్‌లెట్‌లను కొనుగోలు చేయమని ఒత్తిడి చేసే స్కూల్, టీచర్ వివరాలను మంత్రిత్వ శాఖకు [email protected] ఇమెయిల్ ద్వారా నివేదించాలని కోరారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com