సౌదీ అరేబియాలో మాజీ సెక్యూరిటీ చీఫ్‌కి 20 సంవత్సరాల జైలు శిక్ష..!

- September 14, 2024 , by Maagulf
సౌదీ అరేబియాలో మాజీ సెక్యూరిటీ చీఫ్‌కి 20 సంవత్సరాల జైలు శిక్ష..!

రియాద్: అవినీతి కేసులో అరెస్టయిన మాజీ పబ్లిక్ సెక్యూరిటీ డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ ఖలీద్ బిన్ కరార్ అల్-హర్బీకి కోర్టు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు సౌదీ అరేబియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అధికార దుర్వినియోగం సహా పలు నేరాలకు పాల్పడ్డారని కోర్టు నిర్ధారించింది.  లంచం, ఫోర్జరీ ఇతర సంబంధిత నేరాలకు పాల్పడినందుకు పదేళ్ల జైలు శిక్ష,  SR1,000,000 జరిమానా విధించింది.  అల్-హర్బీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం తన పదవిని దుర్వినియోగం చేయడం, ప్రభుత్వ ఒప్పందాలను ఉల్లంఘించడం, ప్రజా నిధులను దుర్వినియోగం చేయడం వంటి నేరాలకు మరో పదేళ్ల జైలు శిక్ష విధించారు. జైలు శిక్ష, జరిమానాతో పాటు SR10,084,303 లంచం సొమ్మును స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఆదేశించింది. అలాగే పబ్లిక్ ఫండ్ నుండి అపహరించిన SR2,827,000ను సేకరించి ఖజానాకు జమ చేయాలని కోర్టు తన తీర్పులో ఆదేశించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com