20 నిమిషాల్లో 4 గంటల వర్కవుట్లు? కొత్త ఫిట్నెస్ ట్రెండ్ వైరల్..!!
- September 15, 2024
యూఏఈ: రొటీన్లో గంటల తరబడి జిమ్‌లో కష్టించే అవసరం లేకుండా, తక్కువ సమయంలో సాంప్రదాయ వ్యాయామం ప్రయోజనాలను అందజేసే ఒక కొత్త ఫిట్నెస్ ట్రెండ్ వైరల్ అవుతుంది.దాని పేరే EMS (ఎలక్ట్రికల్ మజిల్ స్టిమ్యులేషన్). ఒక క్లయింట్ జిమ్‌లో సాధారణంగా నాలుగు గంటల వ్యాయామంలో సాధించే ఫలితాలను కేవలం 20 నిమిషాల్లో సాధించగలరని దుబాయ్ నిపుణుడు ఒకరు చెప్పారు. ఇది బిజీ ప్రొఫెషనల్స్, ఫిట్నెస్ ఔత్సాహికులకు బెస్ట్ ఎంపికగా ఉంటుందన్నారు. EMS శిక్షణలో భాగంగా వివిధ కండరాల సమూహాలకు విద్యుత్ ప్రేరణలను పంపే ఎలక్ట్రోడ్లతో కూడిన ప్రత్యేక సూట్‌ను ధరించిచడం, తద్వారా వాటిని సంకోచించడం జరుగుతుందని తెలిపారు. "బరువులు ఎత్తడం కంటే EMS చాలా ప్రభావవంతంగా ఉంటుంది" అని ఈజీ ఫిట్‌లో మేనేజర్ EMS శిక్షణలో నిపుణుడు మార్కస్ రింగ్లర్ వివరించారు. "ఇరవై నిమిషాల EMS జిమ్‌లో నాలుగు గంటలకు సమానం," అని అతను తెలిపారు. EMS క్లయింట్లలో ఎక్కువగా బిజీ ఎగ్జిక్యూటివ్‌లు, జిమ్ సెట్టింగ్‌లో గంటల తరబడి వ్యాయామాలు చేయలేని వారు ఉంటున్నారని తెలిపారు. అయితే, సాంప్రదాయ వ్యాయామానికి ప్రత్యామ్నాయం కాదని, EMS శిక్షణ ఆకట్టుకునే ఫలితాలను అందిస్తుందని, ఫిట్నెస్ అవసరాల కోసం దానిపై మాత్రమే ఆధారపడవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- దోహా ఫోరం 2025: QR2.016 బిలియన్ల విలువైన ఒప్పందాలు..!!
- అల్-రాయ్‌లో ఇద్దరు కార్మికులు మృతి..!!
- యునెస్కో జాబితాలో ఒమన్ 'బిష్ట్' రిజిస్టర్..!!
- బహ్రెయిన్ లో నేషనల్ డే ,యాక్సెషన్ డే సెలవులు అనౌన్స్..!!
- అల్ రీమ్ ద్వీపంలోని భవనంలో అగ్నిప్రమాదం..!!
- సౌదీ అరేబియాలో చల్లబడ్డ వాతావరణం..!!
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!







