మస్కట్ ఎయిర్ పోర్ట్ కు మరో ఆరు కొత్త ఎయిర్ లైన్స్ సర్వీసులు

- September 16, 2024 , by Maagulf
మస్కట్ ఎయిర్ పోర్ట్ కు మరో ఆరు కొత్త ఎయిర్ లైన్స్ సర్వీసులు

మస్కట్: మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024లో ఆరు కొత్త అంతర్జాతీయ విమానయాన సంస్థలను స్వాగతించింది. ఈ కొత్త సర్వీసులు ఒమన్ యొక్క గ్లోబల్ కనెక్టివిటీని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

ఒమన్ ఎయిర్‌పోర్ట్స్ CEO షేక్ ఐమాన్ బిన్ అహ్మద్ అల్ హోస్నీ ప్రకారం, 2024లో ఆరు కొత్త అంతర్జాతీయ విమానయాన సంస్థలు మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు విమానాలను ప్రారంభించనున్నాయి. వీటిలో నాలుగు ఎయిర్‌లైన్స్ ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించగా, మరో రెండు ఈ సంవత్సరం చివర్లో ప్రారంభించబోతున్నాయి. ఈ విస్తరణ ఒమన్ యొక్క పర్యాటకం, వాణిజ్యం మరియు పెట్టుబడులను పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రస్తుతం 36 విమానయాన సంస్థలు మస్కట్ ఎయిర్పోర్ట్ నుండి 80 ప్రాంతీయ మరియు అంతర్జాతీయ గమ్యస్థానాలకు సేవలు అందిస్తున్నాయి.

2023లో ఐదు కొత్త విమానయాన సంస్థలను విజయవంతంగా ప్రారంభించిన ఒమన్ ప్రభుత్వం, వాటిలో రెండు యూరోపియన్ క్యారియర్‌లు యూరప్ నుండి ఒమన్‌కు ప్రత్యక్ష విమాన సర్వీసులను అందిస్తున్నాయి. ఒమన్ నుండి ఆసియాలోని గమ్యస్థానాలకు ప్రయాణించే మార్గంలో యూరోపియన్ ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని ఈ సరికొత్త ప్రణాళికలు రూపొందించారు.

కొత్తగా ప్రవేశపెట్టిన ఈ సర్వీసుల వలన ఒమన్ విమానాశ్రయాలు మరియు హెరిటేజ్ అండ్ టూరిజం మంత్రిత్వ శాఖ మధ్య సహకారంతో, 2024 చివరి నాటికి ఒమన్‌కు వచ్చే యూరోపియన్ పర్యాటకుల సంఖ్య 500,000 దాటుతుందని అంచనా వేస్తున్నారు.

ఈ విస్తరిస్తున్న నెట్‌వర్క్ ఒమన్ యొక్క గ్లోబల్ కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తుందని మరియు పర్యాటకం, వాణిజ్యం మరియు పెట్టుబడులను పెంపొందిస్తుందని భావిస్తున్నారు.

--వేణు పెరుమాళ్ల✍🏼(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com