ఖైరతాబాద్ సప్తముఖ గణపయ్య నిమజ్జనం పూర్తి

- September 17, 2024 , by Maagulf
ఖైరతాబాద్ సప్తముఖ గణపయ్య నిమజ్జనం పూర్తి

హైదరాబాద్‌: ఖైరతాబాద్ మహాగణపతి 11 రోజులపాటు ఘనంగా పూజలు అందుకుని.. గంగమ్మ చెంతకు చేరుకున్నాడు. గణపతి బప్పా మోరియా అంటూ వేలాది మంది భక్తుల నినాదాల మధ్య సప్తముఖ మహాగణపతి నిమజ్జనం పూర్తి అయ్యింది.70 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఖైరతాబాద్ విగ్రహం.. ఈసారి ఏడు ముఖాలతో దర్శనమించారు.70 సంవత్సరాలు అయిన నేపథ్యంలో 70 అడుగులతో విగ్రహాన్ని ఏర్పాటు చేసింది కమిటీ. ఇక ఇవాళ ఉదయం 6 గంటలకు ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం కాగా మధ్యాహ్నం 1.39 గంటలకు ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం పూర్తయింది. క్రేన్ నెంబర్ నాలుగు వద్ద… ఖైరతాబాద్ విగ్రహాన్ని..గంగమ్మ ఒడికి చేర్చారు. కాసేపటి క్రితమే నిమజ్జనం కూడా పూర్తయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com