తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్
- September 17, 2024తిరుమల: డిసెంబర్ నెల కోటా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్‌లు సెప్టెంబర్ 18 తేదీ ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంటాయని టీటీడీ తెలిపింది. రిజిస్ట్రేషన్‌లు సెప్టెంబర్ 18 తేదీ ఉదయం 10 గంటల నుంచి సెప్టెంబర్ 20 ఉదయం 10 గంటల వరకు తెరిచి ఉంటాయని పేర్కొంది.
డిసెంబర్-2024కి సంబంధించిన కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ వంటి సేవల కోసం శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కోటా బుకింగ్ కోసం సెప్టెంబర్ 21 తేదీ ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంటాయి. డిసెంబర్-2024 తిరుమల అంగప్రదక్షిణం టోకెన్లు బుకింగ్ కోసం సెప్టెంబర్ 23 తేదీ ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంటాయి.
లక్కీ డిప్‌లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?
ఈ టిక్కెట్లతో మొదటి గడప నుంచి శ్రీవారిని దర్శించుకుని, దాదాపు 30 నిమిషాలు శ్రీవారి సేవలో తరించవచ్చు. ఈ సేవలకు తక్కువ టికెట్లు ఉండటంతో డైరెక్ట్ బుకింగ్ ఆప్షన్ లేదు. లక్కీడిప్‌లో పాల్గొనాలి. సుప్రభాత సేవకు ప్రతి రోజూ 270 టికెట్లు ఉంటాయి. అర్చన, తోమాల సేవలకు మంగళ, బుధ, గురువారాల్లో మాత్రమే రోజుకు పది టికెట్లు చొప్పున ఉంటాయి. అష్టదళ పాద పద్మరాధనకు కొన్ని మంగళవారాల్లో మాత్రమే రోజుకు 60 టికెట్లు ఉంటాయి. అందువల్ల ఈ సేవలకు డైరెక్ట్ బుకింగ్ ఆప్షన్ ఇవ్వలేదు. ఎలక్ట్రానిక్ డిప్ ఆప్షన్ ఉంటుంది. ప్రతి నెల 18 తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ డిప్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు తీసే ఎలక్ట్రానిక్ డిప్‌లో ఎంపిక అయిన వారికి మెసేజ్ వస్తుంది. అప్పుడు 21వ తేదీలోపు నగదు చెల్లించి టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
టీటీడీ అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://ttdevasthanams.ap.gov.inద్వారా ఈ ఎలక్ట్రానిక్ డిప్‌లో రిజిస్ట్రర్ చేసుకోవాలి. తొలుత ఈ లింక్ క్లిక్ చేసిన తరువాత టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ సేవా ఎలక్ట్రానిక్ డిప్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. ఆ తరువాత టీటీడీ ఇచ్చే సూచనలు చదివి, దాని కిందన ఉన్న బాక్స్‌లో క్లిక్ చేసి, కంటిన్యూ చేయాలి. అప్పుడు మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ, కంట్రీ, స్టేట్, సిటీ, పిన్‌కోడ్ వంటి వాటిని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత నెంబర్ ఆఫ్ పర్సన్స్ పై క్లిక్ చేసి ఇద్దరు వరకు సెలక్ట్ చేసుకోవచ్చు. ఆ తరువాత ఇద్దరి పేర్లు, వయస్సు, జెండర్, ఫొటో ఐడీ ఫ్రూప్ (ఆధార్, పాస్‌పోర్టు), ఫొటో ఐడీ నెంబర్ వంటి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలన్నీ ఎంటర్ చేసిన తరువాత, కంటిన్యూపై క్లిక్ చేయాలి. సుప్రభాత సేవ, అర్చన, తోమాల, అష్టదళ పాద పద్మరాధన ఈ నాలుగు సేవల్లో దేనికి మీరు వెళ్లాలి అనుకుంటున్నారో దాన్ని ఎంపిక చేయాలి. అక్కడ సేవల ఫీజు, టైమింగ్స్ అన్ని వివరాలు డిస్‌ప్లే అయి ఉంటాయి.
తాజా వార్తలు
- షార్ట్స్‌లో వీడియోల నిడివిని పెంచిన యూట్యూబ్
- కాంగో పడవ ప్రమాదంలో 78 మంది జల సమాధి
- రేపటి నుంచి భారత్–బంగ్లా టీ20 టిక్కెట్ల విక్రయం
- తిరుమల తిరుపతి శ్రీవారికి చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు
- ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వైరం ఏమిటి? ఎందుకు?
- ఇండియాకు పన్నెండు ఐఫోన్ 16 తీసుకొస్తూ.. పట్టుబడ్డ ప్రయాణికులు..!!
- అబుదాబిలో వేటాడుతూ.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ వేటగాళ్లు..!!
- సౌదీ అరేబియాలో ఇన్‌బౌండ్ విజిటర్స్ వ్యయంలో 8.2% వృద్ధి..!!
- GCC-IMF సమావేశం.. ‘ఎకనామిక్స్ ఛాలెంజెస్’పై కీలక సమీక్ష..
- ఎక్స్పో సిటీ దుబాయ్.. మాస్టర్ ప్లాన్‌కు షేక్ మహమ్మద్ ఆమోదం..!!