కేరళలో మరో మంకీపాక్స్ కేసు
- September 19, 2024
కేరళ: పలు దేశాలను కలవరపెడుతున్న మంకీపాక్స్ కేసుల సంఖ్య భారత్‌లో రెండుకు చేరింది. ఇటీవల యూఏఈ నుంచి వచ్చిన 38 ఏళ్ల వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లు కేరళ ఆరోగ్యశాఖ వెల్లడించింది. మలప్పురం జిల్లాకు చెందిన వ్యక్తి మంకీపాక్స్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ ఫేస్‌బుక్ వేదికగా వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చే ఎవరైనా మంకీపాక్స్ లక్షణాలు కనబడితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని, త్వరగా చికిత్స పొందాలని ఆమె విజ్ఞప్తి చేశారు. బాధితుడు ఈ లక్షణాలను ముందుగానే గుర్తించి.. తన కుటుంబం నుంచి ఐసోలేట్ అయ్యాడని పేర్కొన్నారు. ప్రస్తుతం మంజేరి మెడికల్ కాలేజీలో ట్రీట్ మెంట్ పొందుతున్నాడని పేర్కొన్నారు. అతడి నమూనాలను పరీక్షల కోసం పంపించగా.. మంకీపాక్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. భారత్‌లో సెప్టెంబర్ 9న తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. విదేశాల నుంచి వచ్చిన ఓ యువకుడి నమూనాలు పరీక్షించగా.. అది పశ్చిమ ఆఫ్రికాలో వ్యాప్తిలో ఉన్న క్లేడ్-2 రకంగా నిర్ధరించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- రెసిడెన్సీ చెల్లుబాటుకు ఎక్స్ పాట్ ఐడి కార్డు లింక్..!!







