దసరా సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
- September 19, 2024
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది. అక్టోబర్ 2 నుంచి 14వ తేదీ వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 12న దసరా పండుగ ఉంది. 15వ తేదీ నుంచి యథావిధిగా పాఠశాలలు తెరుచుకుంటాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.
దసరా పర్వదినానికి ముందు తెలంగాణలో తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండుగ ఉంటుంది. అక్టోబర్ 2న ఎంగిలిపూల బతుకమ్మ పండుగతో ప్రారంభమై, దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో సంబరాలు ముగుస్తాయి. దసరాకు రెండు రోజుల ముందు సద్దుల బతుకమ్మ పండుగ ఉంటుంది.
డిసెంబర్ 23 నుంచి 27 వరకు ఐదు రోజుల పాటు క్రిస్మస్ హాలీడేస్‌ను కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇక సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 17 వరకు ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం. సంక్రాంతి సెలవులు ఐదు రోజులు ఇచ్చారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమాన సర్వీస్ లు పునరుద్దరణ
- అంతరిక్ష యాత్రకు తెలుగమ్మాయి..
- హైదరాబాద్ పాస్పోర్టు కార్యాలయానికి అరుదైన పురస్కారం
- పార్టీ నేతల తీరు పై సీఎం చంద్రబాబు అసంతృప్తి
- దుబాయ్లో వీసా మోసం కేసు: 21 మంది దోషులు
- ఖతార్ లో విమాన రాకపోకలు ప్రారంభం
- డ్రగ్స్ కొనుగోలు చేశాను.. అమ్మలేదు: శ్రీరామ్
- TTD: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర మ్యూజియం ఏర్పాటు
- ట్యాక్స్ అనేది చట్టబద్ధమైన అవసరం కాదు, వ్యూహాత్మక అత్యవసరం..!!
- కొన్ని యూఏఈ, జీసీసీ ఫ్లైట్స్ తాత్కాలికంగా నిలిపివేత..!!