రాజస్థాన్ లో మెరుగైన అవకాశాలు..పెట్టుబడిదారులకు పిలుపు..!!
- September 21, 2024
దోహా: దోహా, ఇండియా మధ్య సంబంధాలు చాలా దృఢంగా ఉన్నాయని రాజస్థాన్ ప్రభుత్వ పరిశ్రమ మరియు వాణిజ్య శాఖ మంత్రి హెచ్ ఈ కల్నల్ రాజ్యవర్ధన్ రాథోడ్ అన్నారు. రైజింగ్ రాజస్థాన్ ఇన్వెస్ట్‌మెంట్ మీట్ సందర్భంగా తన ముఖ్య ప్రసంగంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ లో మెరుగైన పెట్టుబడి అవకాశాలను అన్వేషించడానికి ఖతార్‌లోని పౌరులు, నివాసితులను ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ఖతార్‌లోని భారత రాయబారి హెచ్‌ఈ విపుల్, రాయబార కార్యాలయానికి చెందిన ఇతర ప్రతినిధులు, భారతీయ ప్రవాసులు, ఖతార్ పెట్టుబడిదారులు పాల్గొన్నారు. అగ్రి ప్రాసెసింగ్, లాజిస్టిక్స్, పెట్రోకెమికల్స్, రియల్ ఎస్టేట్, గనులు, మినరల్స్, టెక్స్‌టైల్స్, ఇండస్ట్రియల్ పార్కులు, టూరిజం వంటి కొన్ని కీలక రంగాలు ఊహించిన వృద్ధిని నడిపిస్తున్నాయని పేర్కొన్నారు. భారతదేశ ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమ 2026 నాటికి $535 బిలియన్లకు చేరుకోవచ్చని అంచనా వేయబడిందని వివరించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!