మనామాలో యాసిడ్ దాడి..మహిళ పరిస్థితి విషమం..!!
- September 22, 2024
మనామా: ముప్పై ఏళ్ల మహిళపై యాసిడ్ విసిరిని 28 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ ప్రకటించింది. ఈ ఘటన రాజధాని గవర్నరేట్‌లో చోటుచేసుకుంది. ఆ వ్యక్తిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్టు తెలిపింది. కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసినట్టు ప్రకటనలో పేర్కొంది. గాయపడ్డ మహిళకు 9, 11 సంవత్సరాల ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఒక ప్రముఖ షాపింగ్ మాల్‌లో ఉన్న సమయంలో యాసిడ్ దాడి జరిగింది. ఈ ఘటనపై లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు దర్యాప్తు ప్రారంభించాయని తెలిపారు. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
తాజా వార్తలు
- సైనిక ప్రతీకారం 'కచ్చితంగా' చర్చకు వస్తుంది: యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అన్వర్ గార్గాష్
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
- టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి హైదరాబాద్ కోర్టులో ఊరట
- తెలంగాణ లో మహిళా పెట్రోల్ బంకులు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!
- డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!









