నగదుతో కార్ల కొనుగోలు.. 5000 KD జరిమానా, జైలుశిక్ష..!!

- September 22, 2024 , by Maagulf
నగదుతో కార్ల కొనుగోలు.. 5000 KD జరిమానా, జైలుశిక్ష..!!

కువైట్: కార్ల కొనుగోలులో నగదు లావాదేవీపై నిషేధాన్ని ఉల్లంఘించడం తీవ్రమైన నేరం. దీనికి KD5,000 వరకు జరిమానా తోపాటు రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించనున్నారు.  అలాగే వాహనాన్ని జప్తు చేస్తామని అధికార యంత్రాంగం హెచ్చరించింది. ఈ మేరకు కువైట్ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ కొత్త నిబంధనలో పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే మూడు నెలలకు మించకుండా సంస్థలపై నిషేధం విధించడం, లేదా లైసెన్స్‌ను రద్దు చేయడం జరుగుతుందని తెలిపారు. ఉల్లంఘనలు పునరావృతమైతే ఆయా సంస్థలను శాశ్వతంగా మూసివేయడం జరుగుతుందని హెచ్చరించారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com