TTD కార్యనిర్వహణ అధికారి శ్యామలరావు గురించి తెలుసుకుందాం...

- September 22, 2024 , by Maagulf
TTD కార్యనిర్వహణ అధికారి శ్యామలరావు గురించి తెలుసుకుందాం...

ఒక గొప్ప మెరిట్ స్టూడెంట్ ఆయన, ఎలా అంటే ఎంసెట్ లో 29 th ర్యాంక్.. తర్వాత కాకినాడ JNTU లో బీటెక్ ,అదవగానే IIT Mumbai నుండి ఎంటెక్... క్యాంపస్ సెలెక్షన్స్ లో BPCL లో ఉద్యోగం ,కొద్దిరోజుల్లోనే IES కి సెలెక్ట్ అయ్యారు. చదువే లక్ష్యం గెలవడమే తన ఆశయం అని కష్టపడితే తప్ప ఒక స్టూడెంట్ కి ఇవన్నీ సాధ్యం కాదు.కొన్నాళ్ళు AIR లో పనిచేసారు తర్వాత సౌత్ సెంట్రల్ రైల్వే కి వచ్చారు.97 లో ఐఏఎస్ కి సెలెక్ట్ అయ్యారు అదీ ఆల్ ఇండియా  34 th ర్యాంక్ . సివిల్స్ లో మేథ్స్ తీసుకున్న ఈయన స్కోర్ 100/100 .ఇప్పటి వరకూ ఈ ట్రాక్ రికార్డుకు చేరుకున్నవాళ్ళు లేరు.

అసోంలో పనిచేసారు తర్వాత ఆంధ్రప్రదేశ్ కి వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ కలెక్టర్ గా  పనిచేసి తర్వాత హైద్రాబాద్ మెట్రో వాటర్ బోర్డు ఎండీ గా చేసారు.ఆ తర్వాత కమర్షియల్ టాక్స్ కమిషనర్  గా చేసారు. వైజాగ్ కలెక్టర్ గా చేస్తునప్పుడు జెనిరీక్ మెడిసిన్స్ మీద అవగాహన పెంచి అందుబాటులోకి వచ్చేలా కృషి చేస్తే 3 లక్షల  ఇంజెక్షన్ 70 వేలకి వచ్చింది అప్పుడు.ఆయన వాటికి "జీవనాధార" అని పేరు పెడితే తర్వాత రోజుల్లో ఆయుష్ అయ్యింది.

ఇండియా లో బయోమెట్రిక్ రావడం కోసం కష్టపడ్డారు ఎందుకంటే రిమోట్ ఏరియాలో స్కూల్స్ లో అటెండెన్స్ మానిటర్ చెయ్యడం కోసం.ఇంతటి విజయాలని తన ఖాతాలో గర్వం గా వేసుకున్న వ్యక్తి అతి సామాన్యం గా కనిపించే J.శ్యామలరావు టీటీడీ ఈవో.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com