'రాబిన్‌హుడ్' ఆస్ట్రేలియా షెడ్యూల్ ప్రారంభం
- September 22, 2024
హీరో నితిన్ అప్ కమింగ్ యాక్షన్, హీస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ 'రాబిన్‌హుడ్' షూటింగ్ షెడ్యూల్ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ప్రారంభమైంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. లీడ్ పెయిర్‌తో డ్యూయెట్ సాంగ్ షూట్ ని టీమ్ ప్రారంభించింది.
కృష్ణకాంత్ లిరిక్స్ తో జివి ప్రకాష్ ఆకట్టుకునే పాటను కంపోజ్ చేశారు. నితిన్, శ్రీలీల డాజ్లింగ్ కెమిస్ట్రీ హైలెట్ గా వుండబోతోంది. మెల్బోర్న్ లో అద్భుతమైన ప్రదేశాలలో షూట్ చేస్తున్న ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.
సాంగ్ తో పాటు బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్‌తో సహా ప్రధాన నటీనటులతో కూడిన ముఖ్యమైన టాకీ పార్ట్ ని చిత్రీకరించనున్నారు.
ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అత్యున్నత స్థాయి నిర్మాణ, సాంకేతిక విలువలతో నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ సాయి శ్రీరామ్.ఎడిటింగ్ కోటి, ఆర్ట్ డైరెక్షన్ రామ్ కుమార్.
రాబిన్‌హుడ్ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 20న విడుదల కానుంది.
నటీనటులు: నితిన్, శ్రీలీల, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ తదితరులు
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: వెంకీ కుడుముల
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
CEO: చెర్రీ
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
డీవోపీ: సాయి శ్రీరామ్
ఎడిటర్: కోటి
ఆర్ట్ డైరెక్టర్: రామ్ కుమార్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరి తుమ్మల
ఫైట్స్: రామ్-లక్ష్మణ్, రవివర్మ, విక్రమ్ మోర్
పబ్లిసిటీ డిజైనర్: గోపి ప్రసన్న
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







