'దేవర’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు
- September 22, 2024
హైదరాబాద్: జూ.ఎన్టీఆర్ హీరోగా నటించిన 'దేవర’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు చేశారు.అభిమానులు భారీగా హాజరు కావడం, అందరినీ లోపలికి అనుమతించకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అభిమానుల తాకిడికి హోటల్ అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం అయ్యాయి. పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఈవెంట్‌ను క్యాన్సిల్ చేశారు.
తారక్, జాన్వీకపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. నోవోటెల్ వేదికగా ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు భారీ ఎత్తున సిద్ధం చేశారు. అయితే నోవాటెల్ ఆడిటోరియమ్ కెపాసిటీని మించి అభిమానులు వేదికకు చేరుకోవడం, ఈవెంట్‌కు హాజరయ్యేందుకు ప్రయత్నించడంతో తోపులాటతో నోవాలెట్ హోటల్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న నోవోటెల్ యాజమాన్యం ఈవెంట్ నిర్వహించడానికి కష్టంగా ఉందంటూ వెనక్కి తగ్గింది. తాము ఈవెంట్ చేయలేమని చివరి నిమిషంలో నోవోటెల్ యాజమాన్యం చేతులెత్తేసింది. హీరో తారక్ ఈవెంట్‌కు వచ్చి ఐదు, పది నిమిషాలు మాట్లాడి వెళ్లిపోతారని ఈవెంట్ ఆర్గనైజర్స్ నోవాటెల్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. కంట్రోల్ చేయలేనంత క్రౌడ్ ఉండడంతో హీరో వస్తే అసలు కంట్రోల్ చేయలేం అని హోటల్ సిబ్బంది నిర్మోహమాటంగా చెప్పారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు.అభిమానుల తాకిడిని కంట్రోల్ చేయడానికి ఈవెంట్ క్యాన్సిల్ చేస్తామని హెచ్చరించినా ఫలితం లేకపోయింది. దీంతో ఇప్పుడు ఈవెంట్‌ను క్యాన్సిల్ చేశారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







