కువైట్ లో AI కెమెరాలు..ట్రాఫిక్ ఉల్లంఘనల పై కొరడా..!!

- September 23, 2024 , by Maagulf
కువైట్ లో AI కెమెరాలు..ట్రాఫిక్ ఉల్లంఘనల పై కొరడా..!!

కువైట్: సీటు బెల్ట్ ధరించకపోవడం, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించడం వంటి ఉల్లంఘనలను రికార్డ్ చేయడానికి కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత పర్యవేక్షణ కెమెరాలను ఉపయోగించాలని అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మొదటి ఉప ప్రధాని, రక్షణ మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహద్ అల్-యూసెఫ్ సౌద్ అల్-సబా ఆదేశాల మేరకు ఉల్లంఘనలను ఆటోమేటిక్ గా పర్యవేక్షించడంలో మంత్రిత్వ శాఖ కృత్రిమ మేధస్సు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేస్తుందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ సాంకేతికత ఉల్లంఘనలను ఖచ్చితంగా ప్రభావవంతంగా పర్యవేక్షిస్తుందని తెలిపారు. తద్వారా రహదారి వినియోగదారుల భద్రతను పెంపొందించే లక్ష్యంతో ఉందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివరించింది. డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, సీటు బెల్టు పెట్టుకోవాలని, డ్రైవింగ్ చేసే సమయంలో ఫోన్ వాడకుండా ఉండాలని అధికారులు పిలుపునిచ్చారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com