కువైట్ క్రౌన్ ప్రిన్స్తో ప్రధాని మోదీ కీలక సమావేశం..!!
- September 23, 2024
కువైట్: కువైట్ క్రౌన్ ప్రిన్స్, షేక్ సబా ఖలీద్ అల్-హమద్ అల్-సబా అల్-సబాతో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం న్యూయార్క్లో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. "కువైట్ క్రౌన్ ప్రిన్స్, హిస్ హైనెస్ షేక్ సబా ఖలీద్ అల్-హమద్ అల్-సబాతో చర్చలు చాలా సంతృప్తికరంగా జరిగాయి. ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్నాలజీ, ఎనర్జీ వంటి మరిన్ని రంగాలలో భారత్-కువైట్ సంబంధాలను ఎలా బలోపేతం చేయాలో మేము చర్చించాము.’’ అని కువైట్ యువరాజుతో భేటీ అనంతరం మోదీ ట్వీట్ చేశారు.
సెప్టెంబర్ నెల ప్రారంభంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కువైట్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా అలీ అల్-యాహ్యాతో సమావేశమయ్యారు. భారతదేశం-కువైట్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చించారు. వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారిక డేటా ప్రకారం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో గల్ఫ్ దేశానికి భారతీయ ఎగుమతులు USD 2.10 బిలియన్లకు చేరుకోవడంతో కువైట్తో భారతదేశ వాణిజ్యం పెరుగుదలను నమోదు చేసింది.
మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ న్యూయార్క్ చేరుకున్నారు. అనంతరం ప్రధాని మోదీ క్వాడ్ సమ్మిట్లో పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!