యువ బహ్రెయిన్: 60% కంటే ఎక్కువ జనాభా 35 ఏళ్లలోపు వారే..!!
- September 23, 2024
మనామా: బహ్రెయిన్ జనాభాలో యువత సంఖ్య పెరిగింది. 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు మూడింట రెండు వంతుల మంది ఉన్నారు. ఈ మేరకు 2024 మొదటి అర్ధ భాగంలో విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేశాయి. 33.1% బహ్రెయిన్లు (దాదాపు 245,102 మంది) 15-35 ఏళ్ల మధ్య ఉన్నారని డేటా తెలిపింది. ఇందులో 15 ఏళ్లలోపు 28%, 35 ఏళ్లలోపు (452,625) 62%గా ఉన్నారు. గణాంకాల ప్రకారం.. 119,078 మంది పురుషులతో పోలిస్తే 15-35 ఏళ్ల మధ్య 126,024 మంది మహిళలు ఉన్నారు. 35-60 సంవత్సరాల వయస్సు గల వారిలో 205,587 మంది బహ్రెయిన్లు ఉన్నారు. ఇక సీనియర్ సిటిజన్ జనాభా పరంగా.. 60 ఏళ్లు పైబడిన వారు మొత్తం బహ్రెయిన్ జనాభాలో 11% (81,524) మంది ఉన్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







