ఢిల్లీ లిక్కర్ కేసు.. వర్చువల్ గా కోర్టు విచారణకు హాజరైన కవిత
- September 25, 2024
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈరోజు కోర్టు విచారణకు హాజరయ్యారు. లిక్కర్ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై ఈరోజు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిపింది. ఈ విచారణకు కవితతో పాటు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో పాటు ఇతర నిందితులు కూడా హాజరయ్యారు. కవిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్ గా విచారణకు హాజరయ్యారు.
ప్రతివాదులకు సీబీఐ అందజేసిన ప్రతులు సరిగా లేవని విచారణ సందర్భంగా కోర్టుకు న్యాయవాదులు తెలిపారు. దీంతో, సరైన ప్రతులను ప్రతివాదులకు అందజేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది. లిక్కర్ కేసులో కవిత ప్రస్తుతం బెయిల్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ 27వ తేదీన కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







