సుధీర్ బాబు ఈ సారేం మ్యాజిక్ చేయబోతున్నాడో.!

- September 25, 2024 , by Maagulf
సుధీర్ బాబు ఈ సారేం మ్యాజిక్ చేయబోతున్నాడో.!

సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా సుధీర్ బాబు సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఇటీవలే ‘హరోం హర’ అంటూ ఓ డిఫరెంట్ యాక్షన్ సినిమాతో ఓటీటీ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు సుధీర్ బాబు.

లేటెస్ట్‌గా మరో కొత్త కాన్సెప్ట్‌తో రాబోతున్నాడు. అదే ‘జటాధర’. రెండూ శివునికి సంబంధించిన టైటిల్సే కావడం విశేషం.

లేటెస్ట్‌గా ఈ సినిమా నుంచి ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ ఆసక్తికరంగా అనిపిస్తోంది. బుల్లెట్‌పై వెళుతున్న సుధీర్ బాబు, ఆ వెనకే బ్యాక్ గ్రౌండ్‌లో ఏదో భయంకరమైన శక్తి వెంటాడుతూ వస్తోంది. ఎర్రటి మెరుపులతో కూడిన ఆకాశం భయంకరంగా కనిపిస్తోంది.

సినిమా కాన్సెప్ట్ విషయానికి వస్తే, ఇదో సూపర్ నేచురల్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఇంతవరకూ ఈ తరహా కంటెంట్ మూవీస్‌లో సుధీర్ బాబు నటించింది లేదు.

చాలా సినిమాలు ఈ టైప్ కాన్సెప్ట్‌లో రూపొందాయ్. కొన్ని విజయవంతమయ్యాయ్ కూడా. మరి, సుధీర్ బాబు టచ్ చేశాడంటే ఆ కంటెంట్‌లోనూ ఖచ్చితంగా ఏదో ఇంట్రెస్టింగ్ విషయం దాగుంటుంది. చూడాలి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com