అమెరికాతో యూఏఈ ఒప్పందం.. ఇకపై సులభంగా ఎంట్రీ..!!

- September 27, 2024 , by Maagulf
అమెరికాతో యూఏఈ ఒప్పందం.. ఇకపై సులభంగా ఎంట్రీ..!!

యూఏఈ: యుఎస్ వీసా ఉన్న యుఎఇ పౌరులు త్వరలో యునైటెడ్ స్టేట్స్‌లోకి సులభంగా, వేగంగా ప్రవేశం పొందుతారు. యూఏఈ, యుఎస్ దేశాన్ని 'గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్'లో చేర్చుతూ ఒప్పందంపై సంతకం చేసింది. దీంతో ఎమిరాటీస్ కోసం సరిహద్దు ప్రయాణ ప్రక్రియను సులభతరం చేసింది.ఈ కార్యక్రమం అక్టోబర్ 2024 నుండి అమల్లో వస్తుంది.  
గ్లోబల్ ఎంట్రీ అనేది US పోర్ట్ ఆఫ్ ఎంట్రీలలోకి ప్రవేశ ప్రక్రియలను వేగవంతం చేసే ఒక ప్రత్యేక కార్యక్రమం. గ్లోబల్ ఎంట్రీ కియోస్క్‌లో సులభంగా చెక్ ఇన్ చేయవచ్చు. వెయిటింగ్, పేపర్ వర్క్ చేయాల్సిన అవసరం ఉండదు.అయితే, గ్లోబల్ ఎంట్రీలో ఉన్నవారు  ప్రవేశించడానికి చెల్లుబాటు అయ్యే US వీసాను కలిగి ఉండాలి.యూఏఈ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ , యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఒప్పందంపై సంతకాలు చేశాయి. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ అధికారిక యుఎస్ పర్యటన సందర్భంగా ఈ కీలక ఒప్పందం జరిగిందని యుఎస్‌లోని యూఏఈ రాయబారి యూసెఫ్ అల్ ఒటైబా తెలిపారు.గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకున్న..  ఆమోదించబడిన ఎమిరాటీ పౌరులు యుఎస్ మరియు ఇతర దేశాలలోని 75 విమానాశ్రయాలలో గ్లోబల్ ఎంట్రీ సిస్టమ్‌ను ఉపయోగించి యుఎస్‌లోకి ప్రవేశించగలరని ఆయన తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com