యూఏఈలో అక్టోబర్ నుండి అమల్లోకి రానున్న మూడు కీలక మార్పులు..!!

- September 28, 2024 , by Maagulf
యూఏఈలో అక్టోబర్ నుండి అమల్లోకి రానున్న మూడు కీలక మార్పులు..!!

యూఏఈ: ప్రజల భద్రత, సౌలభ్యం, జీవన నాణ్యతకు యూఏఈలో ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుంది. ఇందు కోసం కొత్త సేవలు, పాలసీ అప్‌డేట్‌లు ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తాయి.  అక్టోబర్ నుండి అమలులోకి వచ్చే మూడు కొత్త నియమాలు,  వ్యవస్థల వివరాలు మీ కోసం..

1.కొత్త ట్రాఫిక్ రాడార్లు

అజ్మాన్‌లో డ్రైవింగ్ చేయడం చాలా సురక్షితం.  ఎందుకంటే డ్రైవింగ్ సమయంలో ఫోన్‌లను ఉపయోగించడం.,  సీటు బెల్ట్‌లు ధరించకపోవడం వంటి తీవ్రమైన ఉల్లంఘనలను పట్టుకోవడానికి కొత్త ట్రాఫిక్ రాడార్లను ఏర్పాటు చేశారు. ఈ రెండు నేరాలకు Dh400 జరిమానా, నాలుగు బ్లాక్ పాయింట్లు విధించనున్నారు. ఈ స్మార్ట్ మానిటరింగ్ సిస్టమ్ అక్టోబర్ 1 నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుంది.

2.అమెరికాలోకి ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ

 యూఏఈ అధ్యక్షుడి వాషింగ్టన్ పర్యటన సందర్భంగా కుదిరిన ఒప్పందం అక్టోబర్ 1నుండి అమల్లోకి రానుంది. దీని ప్రకారం.. చెల్లుబాటు అయ్యే US వీసా ఉన్న ఎమిరాటీలు ఆ దేశానికి వెళ్లినప్పుడు క్యూలు, ఎక్స్ ట్రా పేపర్ వర్క్ లేకుండా సులభంగా ప్రవేశించవచ్చు. యూఏఈ పౌరులు US గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్ కోసం సైన్ అప్ అవ్వవచ్చు. ఇది అరైవల్ ప్రాసెస్‌ను వేగవంతం చేస్తుంది.  వారికి ఎక్స్‌ప్రెస్ చెక్-ఇన్ ప్రయోజనాలను అమలు చేయనున్నారు. US కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్ ప్రీ-క్లియరెన్స్ ఫెసిలిటీ వద్ద ఉన్న గ్లోబల్ ఎంట్రీ కియోస్క్‌ల ద్వారా అమెరికాలోకి సులువుగా ప్రవేశించవచ్చు.

3.తప్పనిసరి జన్యు పరీక్ష

అక్టోబర్ 1 నుండి, అబుదాబిలో పెళ్లి చేసుకోబోతున్న యూఏఈ పౌరులు వివాహానికి ముందు స్క్రీనింగ్‌లో భాగంగా జన్యు పరీక్ష చేయించుకోవాలి. దంపతులు అబుదాబి, అల్ దఫ్రా మరియు అల్ ఐన్‌లోని ఎమిరేట్‌లోని 22 ప్రాథమిక సంరక్షణ కేంద్రాలలో దేనిలోనైనా ఈ సేవను పొందవచ్చు. జన్యు పరీక్ష ఫలితాలు 14 రోజుల్లో వస్తాయి. ఈ స్క్రీనింగ్ ద్వారా ఆరోగ్యకరమైన పిల్లలకు ఆహ్వానం పలికేందుకు, నివారించగల వ్యాధులను ముందుగానే అరికట్టేందుకు వీలవుతుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com