IIFA: మెగాస్టార్ చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక అవార్డ్
- September 28, 2024
అబుదాబి: మెగాస్టార్ చిరంజీవి గురించి తెలియని వారంటూ ఉండరు. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న హీరో చిరంజీవి. తన అద్భుతమైన సినిమాలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకోవడమే కాకుండా తన నటన, అభినయంతో ఎన్నో అవార్డులను సైతం అందుకున్నాడు. తాజాగా మెగాస్టార్ చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. అబుదాబిలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (IIFA) అవార్డ్స్ 2024 వేడుకల్లో చిరంజీవికి "ఔట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్" సినిమా పురస్కారం అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగు హీరోలు సైతం పాల్గొన్నారు. హీరో వెంకటేష్, బాలకృష్ణతో పాటు యువ హీరోలు దగ్గుబాటి రానా, సుశాంత్ పలువురు నటీనటులు పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని బాలకృష్ణ, రానా వంటి సినీ నటీమణులు అభినందించారు. అలాగే బాలకృష్ణకు "గోల్డెన్ లెగసీ" అవార్డు అందజేశారు. హీరోయిన్ల విషయానికి వస్తే సమంత "ఉమెన్ ఆఫ్ ది ఇయర్" అవార్డును అందుకున్నారు.
నానికి "ఉత్తమ నటుడు" అవార్డు దక్కింది. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాకు ఉత్తమ సినిమాటోగ్రఫీ పురస్కారం వచ్చింది. ఇక ఇటీవల చిరంజీవి ప్రతిష్టాత్మక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. 46 ఏళ్ల తన సినీ కెరీర్ లో 156 చిత్రాలు, 537 పాటలు, 24 వేల డ్యాన్స్ స్టెప్పులతో ప్రేక్షకులను ఎంతగానో అలరించినందుకు చిరంజీవికి ఈ రికార్డు దక్కింది. ఇప్పుడు ఐఐఎఫ్ఏ అవార్డ్స్ 2024లో మరో ప్రతిష్టాత్మక పురస్కారం చిరంజీవికి దక్కడంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







