చాద్ ఫీల్డ్ హాస్పిటల్‌పై దుర్వినియోగ ఆరోపణలు..తీవ్రంగా ఖండించిన ఎమిరేట్స్ రెడ్ క్రెసెంట్..!!
- September 28, 2024
యూఏఈ: చాద్‌లోని యుఎఇ ఫీల్డ్ హాస్పిటల్ దుర్వినియోగానికి పాల్పడుతుందన్న ఆరోపణలను ఎమిరేట్స్ రెడ్ క్రెసెంట్ (ఇఆర్‌సి) తీవ్రంగా ఖండించింది. చాడియన్ నగరమైన అమ్జారస్లోని ఆసుపత్రి "మానవతా కార్యకలాపాలకు కాకుండా ఇతర కార్యకలాపాలకు ఉపయోగించబడుతోంది" అని ఒక వార్తా కథనం పేర్కొంది. ERC మానవతా, స్వచ్ఛంద ప్రయత్నాలపై తప్పుడు ఆరోపణలు రావడం, రాజకీయం చేయడం కలవరపెడుతోందని ఒక ప్రకటనలో రెడ్ క్రెసెంట్ తెలిపింది.
ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్‌క్రాస్ అండ్ రెడ్ క్రెసెంట్ సొసైటీస్ (IFRC) అమ్జారస్ సౌకర్యాన్ని యాక్సెస్ చేయడానికి చేసిన అభ్యర్థనలను తిరస్కరించినట్లు ఆరోపణలను కూడా ERC తిరస్కరించింది. హాస్పిటల్ ప్రాంతానికి యాక్సెస్ హోస్ట్ దేశంలోని స్థానిక అధికారుల అధికార పరిధిలోకి వస్తుందన్నారు. జూలై 2023లో ఏర్పాటైన అమ్జాడ్రాస్ సదుపాయం వారి స్వదేశంలో సంఘర్షణ నుండి పారిపోతున్న సూడానీస్ శరణార్థులతో సహా బలహీన జనాభాకు మద్దతునిస్తోందన్నారు. ఏప్రిల్ 2023లో సుడాన్లో సంక్షోభం చెలరేగిన వెంటనే ఇది ఏర్పాటు చేయబడిందని ERC తెలిపింది. ఆసుపత్రిలో ఇప్పటివరకు 8,808 సూడానీస్, 19,658 చాడియన్లకు చికిత్స అందించినట్టు పేర్కొంది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







