డా.పి.వి.జి.రాజు శతజయంతి ఉత్సవ సభకు అశోక్ గజపతి కి ఆహ్వానం

- September 30, 2024 , by Maagulf
డా.పి.వి.జి.రాజు శతజయంతి ఉత్సవ సభకు అశోక్ గజపతి కి ఆహ్వానం

గుంటూరు: మహారాజా డా.పి.వి.జి.రాజు శతజయంతి ఉత్సవ సభకు  అశోక్ గజపతిరాజు కు ఠాగూర్ మెమోరియల్ ట్రస్ట్ కార్యదర్శి రెడ్ క్రాస్ ఉపాధ్యక్షులు పి.రామచంద్ర రాజు , ప్రముఖ గాయకులు డా.గజల్ శ్రీనివాస్ ఈనెల 30వ తేదీన విజయనగరం లో పి.అశోక్ గజపతి రాజు స్వగృహంలో కలిసి అక్టోబర్ చివరి వారంలో గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరుప  తలపెట్టిన డా.పూసపాటి విజయరామ గజపతి రాజు శత జయంతి సభకు విశిష్ట అతిథిగా హాజరు కావలసిందిగా విజ్ఞప్తి చేశారు.డా.పి.వి.జి.రాజు మనసున్న మహారాజని, దాతృత్వానికి ప్రతీక గా తెలుగు ప్రజల మనస్సులలో  చిర స్థాయిగా నిలిచిన మహనీయుని శత జయంతి సభ గుంటూరులో ఘనంగా జరపడానికి కృషి చేస్తున్నామని పి.అశోక గజపతి రాజుకి తెలిపారు. డా.పి.వి.జి.రాజు శతజయంతి సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆహ్వానించామని వారు సామకూలంగా స్పందించారని అశోక గజపతి రాజుకు వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేస్తున్న సంస్థలను, నిస్వార్ధంగా కృషి చేస్తున్న మహనీయులను, పౌర సంస్థల ప్రతినిధులను ఆహ్వనిస్తున్నామని ఉత్సవ సంచాలకులు బొమ్మిడాల కృష్ణ మూర్తి, సహ సంచాలకులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డిలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com