అల్ మక్తూమ్ బ్రిడ్జిపై రిపేర్లు.. తాత్కాలికంగా బస్ సర్వీసులు మళ్లింపు..!!
- October 01, 2024
దుబాయ్: అల్ మక్తూమ్ వంతెనపై నిర్వహణ కారణంగా దుబాయ్‌లోని కొన్ని బస్సు మార్గాలను తాత్కాలికంగా మళ్లించినట్టు దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ప్రకటించింది. ఈ మార్గాలు — 10, 23, 27, 33, 88, C04, C05, C10, C26, E16, X28, X94 — సెప్టెంబర్ 29 నుండి జనవరి 23, 2025 వరకు నిర్దిష్ట బస్ స్టాప్‌ల గుండా వెళ్లవని తెలిపారు. అల్ మక్తూమ్ వంతెన మీదుగా వెళ్లే బస్సులను తాత్కాలికంగా అల్ గర్హౌద్ వంతెన మీదుగా మళ్లిస్తారు. అల్ మక్తూమ్ వంతెన 2025 జనవరి 16 వరకు సెమీ-ఆపరేషనల్ వేళలను పాటిస్తుందని, ప్రధాన వంతెన సోమవారాలు నుండి శనివారాల్లో రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు మూసివేయబడుతుందని, ఆదివారాల్లో 24 గంటల పాటు మూసివేయబడుతుందని అథారిటీ వెల్లడించింది. మళ్లింపు సమయంలో డ్నాటా 1, డ్నాటా 2, సిటీ సెంటర్ మెట్రో బస్ స్టాప్ 1-1, ఔద్ మేథా బస్ స్టేషన్ 7, ఉమ్ హురైర్ రోడ్ 2, రషీద్ హాస్పిటల్ రౌండ్అబౌట్ 1, రూట్ 23లో సర్వీస్ డెయిరా సిటీ సెంటర్ బస్ స్టేషన్‌లు అందుబాటులో ఉండవని తెలిపారు. తన S'hail యాప్ ద్వారా మార్పులను ఎప్పటికప్పుడు తెలసుకోవాలని అథారిటీ సూచించింది.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!







