కువైట్ లో భారీగా పెరుగుతున్న గుండెపోటు కేసులు.. 71% ప్రవాసులే..!!
- October 01, 2024
కువైట్: కువైట్ హార్ట్ అసోసియేషన్ నిర్వహించిన "కువైట్లో గుండె జబ్బులు" అనే ముఖ్యమైన అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. మే 15, 2023 నుండి ఆగస్టు 2024 వరకు 15 నెలల కాలంలో కువైట్లోని హార్ట్ అసోసియేషన్ సర్వే నిర్వహించింది. ఇందులో మొత్తం 7600 గుండెపోటు కేసులు నమోదయ్యాయి. 5,396 నాన్-కువైటీలు(71%), మిగిలిన 2,206 మంది కువైట్ జాతీయులు(29%) ఉన్నారు. ఈ కేసులలో మరణాల రేటు 1.9%.. ప్రపంచ సగటుతో సమానంగా ఉంది. బాధితుల్లో 82% కేసులు పురుషులు (6,239), స్త్రీలు 18% (1,363) ఉన్నారు. 43% మంది రోగులు ధూమపానం చేసేవారని,13% మంది ధూమపానాన్ని వదిలిన వారున్నారని అధ్యయనం తెలిపింది. గుండెపోటుకు గురయిన వారిలో సగానికి పైగా మధుమేహంతో బాధపడుతుండగా.. బాధితుల సగటు వయస్సు 56 సంవత్సరాలుగా ఉందని నివేదికలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అస్థిర వాతావరణం..రియాద్ లో స్కూల్స్ బంద్..!!
- కువైట్ నేవీ పెట్రోల్ బోట్ గరో, ఇండియన్ షిప్ కండక్ట్ జాయింట్ డ్రిల్..!!
- దర్బ్ అల్ సాయ్ ని సందర్శించిన పీఎం..!!
- సనద్ సేవా కేంద్రాల ల్యాబ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- బహ్రెయిన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ రూట్ మ్యాప్..!!
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!







