సౌదీ అరేబియా జీడీపీలో 49.9%కి చేరిన చమురుయేతర కార్యకలాపాలు..!!
- October 02, 2024
రియాద్: సౌదీ అరేబియా మొత్తం స్థూల దేశీయోత్పత్తి (GDP)లో చమురుయేతర కార్యకలాపాల వాటా 4.4 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది 2023 సంవత్సరంలో 49.9 శాతానికి చేరుకుంది. సౌదీ సెంట్రల్ బ్యాంక్ (SAMA) విడుదల చేసిన ఆర్థిక స్థిరత్వ నివేదిక 2024లో ఈ మేరకు వెల్లడించారు. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి కొనసాగుతున్నప్పటికీ, 2023లో సౌదీ ఆర్థిక వ్యవస్థ దృఢమైన ఆర్థిక రంగం మద్దతుతో నిలకడగా ఉందని నివేదిక తెలిపింది. ఆర్థిక వ్యవస్థను వైవిధ్యపరిచే లక్ష్యంతో ఉన్న విజన్ 2030 యొక్క ప్రతిష్టాత్మక లక్ష్యాల కారణంగా మొత్తం GDPలో చమురుయేతర కార్యకలాపాల వాటాను 49.9 శాతానికి పెంచాయన్నారు. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు 2023లో మెరుగైన వృద్ధిని నమోదు చేశాయని, ఎందుకంటే ఫైనాన్స్ కంపెనీల రుణాలు 12.3 శాతం పెరిగి SR84.7 బిలియన్లకు చేరాయని ప్రకటించారు. ఆర్థిక స్థిరత్వ నివేదిక 2024 SAMA వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







