ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడి సహకారంపై చర్చించిన భారత రాయబారి..!!

- October 02, 2024 , by Maagulf
ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడి సహకారంపై చర్చించిన భారత రాయబారి..!!

కువైట్: కువైట్‌లోని భారత రాయబారి ఆదర్శ్ స్వైకా.. కువైట్ వాణిజ్య పరిశ్రమల మంత్రి ఖలీఫా అబ్దుల్లా ధాహి అల్-అజీల్ అల్ అస్కర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా  ద్వైపాక్షిక వాణిజ్యం,  పెట్టుబడి సహకారాన్ని ముందుకు తీసుకెళ్లే మార్గాలపై చర్చించారు. ఈ మేరకు కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం Xలో తెలిపింది.  భారత రాయబారి ఆదర్శ్ స్వైకా కువైట్ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ బందర్ సలేం అబ్దుల్లా అల్-ముజాయాన్‌ను కూడా కలిశారు. ఇండియా- కువైట్ మధ్య ద్వైపాక్షిక సహకారం సహా వివిధ అంశాలపై ఇద్దరు అధికారులు చర్చించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com