"మస్కట్ ఇన్‌స్పైర్స్ అస్".. షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్‌ ప్రారంభం..!!

- October 02, 2024 , by Maagulf
\

మస్కట్: మస్కట్ గవర్నరేట్ "మస్కట్ ఇన్‌స్పైర్స్ అస్" షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఒమానీ ఫిల్మ్ మేకర్స్-ఔత్సాహికుల నుంచి ఎంట్రీలను ఆహ్వానిస్తుంది. టూరిజం, కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్, డెవలప్‌మెంట్, హిస్టరీ, కల్చర్, సస్టైనబుల్ లెర్నింగ్, ఆర్కిటెక్చరల్ ఐడెంటిటీ వంటి కీలక ఇతివృత్తాలపై దృష్టి సారించే షార్ట్ ఫిల్మ్‌ల ద్వారా గవర్నరేట్ విజయాలను హైలైట్ చేయడం ఈ చొరవ లక్ష్యమని పేర్కొన్నారు.  

ఈ పోటీలో దర్శకులు, నిర్మాతలు, విద్యార్థులు, చలనచిత్ర సంస్థలు, ఫోటోగ్రాఫర్‌లు, కళాకారులతో సహా విస్తృత శ్రేణిలో పాల్గొనవచ్చు. వివిధ రంగాలలో దాని పురోగతి , విజయాలను ప్రచారం చేస్తూ మస్కట్ స్ఫూర్తిని ప్రతిబింబించే కంటెంట్‌ ఉన్న షార్ట్ ఫిలింలను పంపాలని సూచించారు.   వచ్చిన ఎంట్రీల నుంచి ఒమన్ ఫిల్మ్ సొసైటీ, సమాచార మంత్రిత్వ శాఖ సభ్యులతో కూడిన జ్యూరీచే విజేతలను ఎంపిక చేస్తుంది. టాప్ బహుమతి RO 2,500, రెండవ స్థానానికి RO 1,500, ఆ తర్వాత ఏడవ స్థానం వరకు  RO 200 నగదు బహుమతులను అందజేయనున్నారు.  మరింత సమాచారం కోసం 90999110 నంబర్ ద్వారా సంప్రదించాలని కోరారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com