విద్యతోనే తీవ్రవాదానికి చెక్.. శాంతి సాధనంలో కీలక భూమిక..HM రాజు
- October 03, 2024
మనామా: శాంతిని కాపాడేందుకు, అన్ని రకాల తీవ్రవాదాలను ఎదుర్కోవడానికి విద్య పాత్ర ఎంతో కీలకమని మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా స్పష్టం చేశారు. శాంతిని సాధించడం, పొరుగు దేశాలతో బలమైన సంబంధాలను పెంపొందించడానికి బహ్రెయిన్ రాజ్యం అంకితభావాన్ని ఆయన పునరుద్ఘాటించారు. సఖిర్ ప్యాలెస్‌లో రాజకుటుంబానికి చెందిన సీనియర్ సభ్యులు, అధికారులు, పౌరులు, వివిధ విద్యా సంస్థల నుండి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కలుసుకున్న సందర్భంగా హెచ్‌ఎం రాజు ఈ మేరకు వ్యాఖ్యానించారు. మానవ, మతపరమైన విలువలను గౌరవించాలని సూచించారు. ప్రాంతీయ స్థిరత్వాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. వివిధ దేశాలలో జరుగుతున్న యుద్ధాలపై ఆందోళన వ్యక్తం చేశారు. పౌరులందరికీ గౌరవప్రదమైన జీవితాన్ని అందించడానికి ఆరోగ్య సంరక్షణ, విద్య, గృహాలు, ఉపాధి వంటి అవసరమైన సేవలను అందించడంపై దృష్టి పెట్టాలని హెచ్‌ఎం రాజు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







