యూఏఈలో ఆరోగ్య సంరక్షణ.. Dh7,600 వెచ్చిస్తున్న నివాసితులు.. సర్వే..!!
- October 03, 2024
యూఏఈ: యూఏఈలోని నివాసితులు సగటున సంవత్సరానికి Dh7,600 ఆరోగ్య సంరక్షణ కోసం ఖర్చు పెడుతున్నారట. ఈ మేరకు బ్రాండ్ ఫైనాన్స్ కొత్త నివేదికను విడుదల చేసింది. అత్యధిక సంఖ్యలో 81 శాతం నివాసితులు యూఏఈ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. 10లో దాదాపు 8 మంది ( 81 శాతం) దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ నుండి లబ్ధి పొందుతున్నట్లు తెలిపారు. 84 శాతం మంది నివాసితులు గత దశాబ్దంలో ఎమిరేట్స్‌లో ఆరోగ్య సంరక్షణ నాణ్యత మెరుగుపడిందని నమ్ముతున్నారు. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో యూఏఈ పెట్టుబడులు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయని బ్రాండ్ ఫైనాన్స్ మేనేజింగ్ డైరెక్టర్ రిచర్డ్ హైగ్ అన్నారు. ప్రతి వ్యక్తికి సగటు వార్షిక ఆరోగ్య సంరక్షణ ఖర్చు Dh7,600 ($2,100)తో 64 శాతం మంది నివాసితులు ఇప్పటికీ యూఏఈ ఆరోగ్య సంరక్షణను ఖరీదైనదిగా భావిస్తున్నారని హై పేర్కొన్నారు. ఈ సర్వేలో 2వేల మంది నివాసితులు పాల్గొన్నారు. ఇందులో 21 శాతం పౌరులు కాగా, 79 శాతం ప్రవాసులు ఉన్నారని సర్వే సంస్థ వెల్లడించింది.
యూఏఈ నివాసితులలో 78 శాతం మంది దేశంలో ఆరోగ్యకరమైన జీవనశైలిని, వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం మరియు మరిన్నింటి ద్వారా జీవించడం చాలా సులభం అని భావిస్తున్నారు. జిమ్‌లు, ఉద్యానవనాలు, ఆరోగ్యకరమైన ఆహారం మొదలైనవి చాలా మందికి తక్షణమే అందుబాటులో ఉన్నాయని అనేకమంది తెలిపారు. బ్రాండ్ ఫైనాన్స్ సర్వే ప్రకారం.. దుబాయ్‌లో ఆస్టర్ అత్యధిక రేటింగ్ పొందిన బ్రాండ్‌గా నిలిచింది. అయితే షేక్ ఖలీఫా (సెహా) దేశవ్యాప్తంగా అత్యంత మెరుగైన వ్యక్తిగత ఆసుపత్రిగా గుర్తింపు పొందింది. నేషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ (డామన్) అనేది జాతీయంగా ఉత్తమ ఆరోగ్య బీమా బ్రాండ్ నిలిచింది.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







