నస్రల్లా వారసుడి లక్ష్యంగా బీరూట్ పై ఇజ్రాయెల్ దాడి..
- October 04, 2024
లెబనాన్ రాజధాని బీరుట్ పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి.హెజ్ బొల్లా తీవ్రవాద సంస్థ అధినేత హసన్ నస్రల్లా వారసుడిగా భావిస్తున్న హసీమ్ సఫీద్దీన్ లక్ష్యంగా ఈ దాడిని ఇజ్రాయెల్ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. హషీమ్ ప్రస్తుతం హెజ్ బొల్లా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ హెడ్ గా ఉన్నాడు. హసన్ నస్రల్లాకు అతను దగ్గరి బంధువు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల క్రమంలో.. ఇవాళ ఉదయం బీరుట్ లోని విమానాశ్రయం వద్ద విమానం ల్యాండ్ అయిన కొద్ది నిమిషాలకే భారీ పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. బీరుట్ విమానాశ్రయంలో దిగిన విమానం (మిడిల్ ఈస్ట్ ఎయిర్ లైన్స్ ఎంఈ 429) దుబాయ్ నుంచి వచ్చింది. విమానాశ్రయానికి ఆరు కిలో మీటర్ల దూరంలో ఉన్న సిన్ఎల్ఫిల్ నుంచి ఈ మంటలు కనిపించాయని స్థానికులు తెలిపారు. విమానాశ్రయంలో ఎలాంటి నష్టం జరగలేదని తెలుస్తోంది. ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు ఇంకా నిర్ధారణకాలేదు.
ఇజ్రాయెల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ హెర్జి హలేవి ఓ టెలివిజన్‌లో మాట్లాడుతూ.. లెబనాన్ లోని హెజ్ బొల్లా స్థావరాలను లక్ష్యం చేసుకోని తమ దాడులు కొనసాగుతాయని తెలిపాడు. టెర్రరిస్ట్ గ్రూపులను వాటి స్థావరాలను తిరిగి స్థాపించుకునే అవకాశం ఇవ్వకుండా తమ దాడులు ఉంటాయని తెలిపాడు. భవిష్యత్తులో హెజ్ బొల్లాను ఈ ప్రదేశాలలో స్థాపించడానికి మేము అనుమతివ్వము. హెజ్ బొల్లా కు వ్యతిరేకంగా తీవ్రమైన దాడులు అన్ని ప్రాంతాల్లో కొనసాగుతాయని చెప్పారు.
ఇజ్రాయెల్ మీడియా ప్రకారం.. హెజ్ బొల్లా సీనియర్ నాయకుల సమావేశం జరిగిన బంకర్ పై దాడి చేయడం జరిగిందని, ఈ దాడిలో హెజ్బొల్లా కొత్త అధిపతి, హసన్ నస్రల్లా సోదరుడు హషీమ్ సఫీద్దీన్ మరణించినట్లు కూడా నివేదికలు ఉన్నాయి. అయినప్పటికీ ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ధృవీకరణ కాలేదు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







