ఈ నెల 26న కబాలి ఆడియో..

- June 21, 2016 , by Maagulf
ఈ నెల 26న కబాలి ఆడియో..

సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ... కబాలీ ... ఇప్పుడు కోలీవుడ్, టాలీవుడ్ లలో హాట్ టాపిక్. ఇప్పటికే బిగ్ హైప్ వచ్చిన ఆ పిక్చర్ రిలీజ్ కోసం లక్షలాదిమంది ఎదురు చూస్తున్నారు. తమిళంలో ఈ మధ్య కబాలి సినిమా ఆడియో విడుదలైంది. తెలుగులోను ఈ సినిమా ఆడియోను విడుదల చేయాలని భావించిన నిర్మాతలు ఈ నెల 26న ఆడియో డేట్ ఫిక్స్ చేశారు. నిర్మాతలు కె. ప్రవీణ్ కుమార్, కె.పి. చౌదరి ఇప్పటికే ఎరేంజ్ మెంట్స్ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. కబాలి ఆడియో ఫంక్షన్ కు తెలుగు, తమిళ సినీరంగాలకు చెందిన సెలెబ్స్ ను ఇన్వైట్ చేయబోతున్నట్టు నిర్మాతలు తెలిపారు. తమిళంలో కబాలికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించిన సంగతి తెలిసిందే. తెలుగు వెర్షన్ కు రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్, వనమాలి పాటలు రాశారు.
సాహితి డైలాగ్స్ అందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com