తిరుమల తిరుపతి శ్రీవారికి చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు
- October 04, 2024
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తిరుమల తిరుపతి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకు ముందు వరిపట్టం చుట్టుకుని పట్టువస్త్రాలు తీసుకుని ఆలయానికి వెళ్లారు.
తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి తొలుత బేడి ఆంజనేయస్వామిని ఆయన దర్శించుకున్నారు. ఇవాళ రాత్రికి తిరుమలలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు బసచేయనుంది. రేపు తిరుమలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు చంద్రబాబు. భక్తుల అన్నప్రసాదానికి అత్యాధునిక వసతులతో ఏర్పాటుచేసిన వకులమాత సెంట్రలైజ్‌డ్ కిచెన్ ను ప్రారంభించనున్నారు.
కాగా, నేటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. మీనలగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ 9 గంటలకు పెద్దశేష వాహన సేవతో వాహన సేవలు ప్రారంభమవుతాయి. వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. చంద్రబాబు నాయుడి పర్యటన దృష్ట్యా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసింది.
తాజా వార్తలు
- తిరుమల: శోభాయమానంగా పుష్పపల్లకీ సేవ
- సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించిన టాస్క్ ఫోర్స్
- జూలై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాలపు సమావేశాలు
- ఐసిసి ర్యాంకింగ్ లో 'కింగ్' విరాట్ కోహ్లినే!!
- సిరియా సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి
- కేంద్ర మంత్రి పాటిల్ సమక్షంలో చంద్రబాబు, రేవంత్ భేటి
- శ్రీవాణి టికెట్ల కేంద్రంలో సౌకర్యాలు కల్పించండి: టీటీడీ ఈవో శ్యామలరావు
- సలాలా అగ్రిటూరిజం ప్రాజెక్టులో గణనీయమైన పురోగతి..!!
- అబుదాబిలో 12 ప్రైవేట్ స్కూల్స్ పై నిషేధం..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్.. మిర్దిఫ్లో ట్రాఫిక్ డైవెర్షన్స్ అమలు..!!