మెట్రో రైడర్స్ కు గుడ్ న్యూస్.. ఈ-స్కూటర్లపై నిషేధం ఎత్తివేత..!!
- October 05, 2024దుబాయ్: మెట్రో, ట్రామ్‌లో ప్రయాణికులు ఇప్పుడు ఇ-స్కూటర్‌లను తీసుకెళ్లవచ్చని దుబాయ్‌లోని రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ప్రకటించింది. ఇకపై సీటు లేకుండా ఫోల్డబుల్ ఇ-స్కూటర్‌లను మెట్రో, ట్రామ్‌లోని అన్ని కార్యాచరణ సమయాల్లో తీసుకెళ్లవచ్చు. ప్రయాణీకుల భద్రత కోసం మార్చి 1 నుండి మెట్రో, ట్రామ్ లోపల ఇ-స్కూటర్లపై ఫిబ్రవరి 29న ఆర్టీఏ నిషేధం విధించింది. అయితే, అవి తప్పనిసరిగా 120cm x 70cm x 40cm పరిమాణం స్పెసిఫికేషన్‌కు సరిపోవాలి. 20kg కంటే ఎక్కువ బరువు ఉండకూడదన్న షరతులు విధించింది. మరికొన్ని నిబంధనలు ఇలా ఉన్నాయి.
-దుబాయ్ మెట్రో లేదా ట్రామ్ ప్రాంగణంలో ఇ-స్కూటర్ ఛార్జింగ్ పెట్టవద్దు.
-తలుపులు, సీట్ల వద్ద అడ్డంగా పెట్టవద్దు.
-దుబాయ్ మెట్రో లేదా ట్రామ్ ప్రాంగణంలోకి తడి లేదా మురికి ఇ-స్కూటర్‌లు అనుమతించబడవు.
-స్టేషన్‌లు లేదా ఫుట్‌బ్రిడ్జ్‌లలో ఇ-స్కూటర్‌ను నడపడం నిషేధం.
-స్టేషన్‌లు, ప్లాట్‌ఫారమ్‌లు లేదా రైళ్లు/ట్రామ్‌లలోకి ప్రవేశించేటప్పుడు ఇ-స్కూటర్‌లను తప్పనిసరిగా మడతపెట్టాలి.
-మెట్రో లేదా ట్రామ్ ప్రాంగణంలో అన్ని సమయాల్లో ఇ-స్కూటర్ పవర్‌ను ఆఫ్ చేయాలి.
తాజా వార్తలు
- పాకిస్తాన్: రైల్లో బాంబు పేలుడు..20 మంది దుర్మరణం
- షార్జా ఎడారిలో మోటర్‌బైక్ బోల్తా..వ్యక్తిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- దుబాయ్ రైడ్.. కీలక రహదారులల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. !!
- యాదాద్రి పేరు మార్పు,టీటీడీ తరహాలో టెంపుల్ బోర్డు...
- వాహనదారులు అలెర్ట్.. పోలీసు కెమెరాల నిఘాలో దుబాయ్ రోడ్లు..!!
- ఐలా బ్యాంక్.. రెండు జ్యువెలరీ ప్రచారాలు ప్రారంభం..!!
- ఉత్తర రియాద్‌లో భూమి లావాదేవీలపై పరిమితులు ఎత్తివేత..!!
- నవంబర్ 10న దుబాయ్ మెట్రో సమయాలు పొడిగింపు..!!
- కొత్త తరహా దోపిడీ…అప్రమత్తం అంటున్న తెలంగాణ పోలీస్
- యూఏఈలోని ప్రవాస గృహయజమానులు మీ ఆస్తిని ఇలా సురక్షితం చేసుకోండి