కువైట్ లో తక్షణ చెల్లింపు కోసం 'WAMD' సర్వీస్ ప్రారంభం..!!

- October 05, 2024 , by Maagulf
కువైట్ లో తక్షణ చెల్లింపు కోసం \'WAMD\' సర్వీస్ ప్రారంభం..!!

కువైట్: కస్టమర్లకు ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అనుభవాన్నిఇచ్చే లక్ష్యంతో.. నగదు లావాదేవీలను తగ్గించడం ద్వారా వివిధ ఎలక్ట్రానిక్ చెల్లింపు మార్గాలను పరిచయం చేస్తున్నట్టు KNET ప్రకటించింది. ఇందులో భాగంగా WAMD సర్వీస్ ను ప్రారంభించినట్టు వెల్లడించింది. దీని ద్వారా ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిలలో చెల్లింపులు చేయవచ్చని పేర్కొంది.  WAMD సేవ ఆధునిక ఆర్థిక సాంకేతికతలకు అనుగుణంగా ఉపయోగించడానికి సులభమైన అధిక-నాణ్యత,  సమర్థవంతమైన సేవ అని KNET  సీఈఓ ల్ఖేష్నం తెలిపారు. ఇది వ్యక్తిగత బ్యాంక్ ఖాతాల మధ్య డబ్బును బదిలీ చేసేటప్పుడు వేగం, భద్రత పరంగా వినియోగదారులకు ప్రత్యేకమైన,  అపూర్వమైన అనుభవాన్ని అందిస్తుందన్నారు. WAMD సేవ స్థానిక బ్యాంకుల మొబైల్ అప్లికేషన్‌లలో చెల్లింపు, బదిలీ ఎంపికగా అందుబాటులో ఉంటుందని అల్ఖేష్నం వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com