ఖైతాన్లో ట్రాఫిక్ క్యాంపెయిన్.. 51 మంది అరెస్టు..!!
- October 05, 2024
కువైట్: అంతర్గత మంత్రిత్వ శాఖ ఖైతాన్ ప్రాంతంలో ట్రాఫిక్ క్యాంపెయిన్ ను నిర్వహించింది. వివిధ చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన 51 మందిని అరెస్టు చేశారు. మొదటి ఉప ప్రధాని, రక్షణ మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహద్ అల్-యూసెఫ్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ క్యాంపెయిన్ జరిగింది. మహిళా పోలీసు అధికారులతో సహా స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ మద్దతుతో జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్, జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎమర్జెన్సీ పోలీస్ మరియు పబ్లిక్ సెక్యూరిటీ సెక్టార్కు చెందిన అధికారులు ఇందులో పాల్గొన్నారు.
క్యాంపెయిన్ సందర్భంగా 2,831 ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేశారు. 34 మంది వ్యక్తులపై అరెస్ట్ వారెంట్లు జారీ చేశారు. రెసిడెన్సీ వర్క్ చట్టాన్ని ఉల్లంఘించిన 17 మందిని అదుపులోకి తీసుకోగా.. 22 వాంటెడ్ వాహనాలను సీజ్ చేశారు. రానున్న రోజుల్లో దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇదే తరహా ప్రచారం కొనసాగుతుందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!







