తుబ్లీ కారు దొంగతనం..మహిళా జైలుశిక్ష రద్దు..!!

- October 05, 2024 , by Maagulf
తుబ్లీ కారు దొంగతనం..మహిళా జైలుశిక్ష రద్దు..!!

మనామా: తుబ్లీలోని ఒక సూపర్ మార్కెట్ వెలుపల కారును దొంగిలించిన మహిళ, ఈ సంఘటనలో ఆమె మానసిక స్థితి సరిగా లేదని అప్పీల్ కోర్టు నిర్ధారించడంతో జైలు నుండి విడుదలయ్యారు. కారు యజమాని సూపర్ మార్కెట్‌లోకి వెళ్లగా ఓ మహిళ కారుతో ఉడాయించేందుకు యత్నించింది. యజమాని ఆమెను ఆపడానికి ప్రయత్నించినప్పటికీ, ఆమె కారును పోనియడంతో అతనికి స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం వాహనాన్ని హమద్ టౌన్‌లో పోలీసులు గుర్తించారు మహిళపై తొలుత కారు దొంగతనం అభియోగాలు మోపగా, కింది కోర్టు ఆమెకు ఏడాది జైలు శిక్ష విధించింది. అయితే, ఆమె న్యాయవాది మహిళ మానసిక బాగోలేదని తీర్పుపై అప్పీల్ చేశారు. కోర్టు వైద్యవిచారణకు ఆదేశించింది. వాస్తవంగానే ఆమె మానసిక పరిస్థితి బాగోలేదని నివేదిక రావడంతో అప్పీల్స్ కోర్ట్ ఆమె జైలు శిక్షను రద్దు చేసింది. ఆమె విడుదలకు తగినదని న్యాయమూర్తి నిర్ధారించే వరకు మానసిక ఆసుపత్రిలోని చికిత్సా అందించాలని ఆదేశించారు. కేసు ఫైల్స్ ప్రకారం.. ఈ చోరీ ఘటన మే 2024 లో జరిగింది.      

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com