చిక్కుల్లో నాగార్జున.! అన్ని వైపులా లాక్ అవుతున్నాడుగా.!
- October 05, 2024
గత రెండు మూడు రోజులుగా అక్కినేని నాగార్జున వార్తల్లో నిలుస్తున్నారు. మాజీ కోడలు సమంత విడాకుల విషయమై చెలరేగిన వివాదం, హైడ్రాలో భాగంగా ఎన్. కన్వెన్షన్ కూల్చివేత.. ఇలా రకరకాలుగా మలుపులు తిరుగుతోంది.
ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు సీజన్‌కి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఆయనకు ఎలిమినేషన్‌లో భాగంగా సోనియా కూడా వదిలిపెట్టడం లేదు. తన ఎలిమినేషన్‌కి నాగార్జునే కారణం అన్నట్లుగా మాట్లాడుతూ ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలిచ్చుకుంటూ పోతోంది.
ఓ వైపు సమంత, నాగ చైతన్య విడాకులకు సంబంధించి మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో నాగార్జున అండ్ ఫ్యామిలీ మండి పడుతున్నారు.
ఆ విషయంలో ఆయనకు సినీ ఇండస్ట్రీ నుంచి కొందరి సపోర్ట్ అయితే లభించింది. ఒకింత నష్టం జరిగినప్పటికీ మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారనుకోండి. అక్కడితో ఆ విషయం సద్దుమనిగిపోయిందనుకుంటే, మరో కొత్త కేసు వచ్చి నాగార్జున తలకు చుట్టుకుంది.
తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం, ఎన్ కన్వెన్షన్ అక్రమ కట్టడం అని తేలడంతో ఆయనపై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైందని తెలుస్తోంది. మరి ఈ కేసు నుంచి నాగార్జున ఎలా బయటపడతారో చూడాలి మరి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!