హీరోల పై మాళవికా మోహనన్ ఘాటు వ్యాఖ్యలు.!
- October 05, 2024
సినిమా హిట్టయితే, ఆ క్రెడిట్ హీరోలకిచ్చేస్తారు. ఒకవేళ ఫ్లాప్ అయ్యిందంటే చాలు హీరోయిన్లను ఐరెన్ లెగ్ అనేస్తుంటారు. ఇది చాలా కాలంగా సినీ ఇండస్ట్రీలో జరుగుతోన్న తంతే.
చాలా మంది హీరోయిన్లు ఈ అనుభవాన్ని పేస్ చేశారు. కొందరు హీరోయిన్లయితే ఓపెన్‌గా ఈ విషయాన్ని బయట పెట్టి వాదనలు కూడా వినిపించారు.
కానీ, ఆ పద్ధతి మాత్రం మారలేదు. తాజాగా ఈ తరహా వాదనలే నటి మాళవికా మోహనన్ చేస్తోంది. మాళవికా మోహనన్ ఇప్పుడు ట్రెండింగ్‌లో వున్న ముద్దుగుమ్మ. తమిళంలో స్టార్ హీరోల సరసన నటించి సక్సెస్‌ల మీద సక్సెస్ అందుకుంది.
లేటెస్ట్గా ‘తంగలాన్’ సినిమాలో నటించి సూపర్ హిట్ కొట్టింది. ప్రస్తుతం తమిళ హీరోతో ‘సర్దార్ 2’ సినిమాలో నటిస్తోంది. అలాగే తెలుగులో ‘ది రాజా సాబ్’ సినిమా కోసం ప్రబాస్‌తో జత కడుతోంది.
ఏదో ఒక సెన్సేషనల్ అంశంతో వార్తల్లో నిలుస్తుంటుంది మాళవికా మోహనన్. తాజాగా హీరోలపై ఘాటు విమర్శలు చేస్తూ హాట్ టాపిక్ అయ్యింది. ఒక సినిమా హిట్టయ్యిందంటే 24 ఫ్రేమ్స్ బాధ్యత ఖచ్చితంగా వుంటుంది. అలాగే ఫ్లాప్ అయినా. కానీ, ఫ్లాప్ అయితే మాత్రం తప్పంతా హీరోయిన్ మీదే నెట్టేస్తారు. కేవలం సౌత్ సినిమాల్లోనే కాదు, మిగిలిన భాషా సినిమాల్లోనూ ఈ తంతు నడుస్తోందంటూ మాళవిక వ్యాఖ్యానించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!