ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం..130 మంది టీచర్లకు ప్రమోషన్లు..!!
- October 06, 2024
మనామా: బహ్రెయిన్ విద్యా మంత్రిత్వ శాఖ 130 మందికి పైగా టీచర్లకు ప్రమోషన్లను ఇచ్చింది. వారిని సీనియర్ టీచర్లుగా ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈసా టౌన్‌లోని మినిస్ట్రీ హాల్లో టీచర్లకు ప్రమోషన్ లెటర్లను అందజేయనున్నట్లు పేర్కొంది. దేశ భవిష్యత్తును రూపొందించడంలో అధ్యాపకుల కృషిని క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి అయిన హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ప్రశసించినట్లు మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ సందర్భంగా విద్యా శాఖకు హెచ్ఆర్హెచ్ ప్రిన్స్ సల్మాన్ అందిస్తున్న సహాయాన్ని విద్యాశాఖ మంత్రి డాక్టర్ మహమ్మద్ జుమా ప్రశంసించారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్‌లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్‌లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్‌లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్







