ఒమాన్ లో ఉపవాసం - అనంతరం భుక్తాయాసం!

- July 06, 2015 , by Maagulf
ఒమాన్ లో ఉపవాసం - అనంతరం భుక్తాయాసం!

 

సుల్తానెట్ ఆఫ్ ఒమాన్ లో, పవిత్ర రమదాన్ మాసంలో డజన్ల కొద్దీ ప్రజలు రోజూ అతిభోజనం వలన ఆసుపత్రుల పాలౌుతున్నారని రువి లోని బద్ర్ అల్ సమా సీనియర్ ఇంటర్నిస్ట్ ఏ బషీర్ తెలిపారు. చాలా సేపు ఉపవాసం చేసిన మీదట భోజనంపై అధిక మక్కువ కలగడం సహజమేనని, ఐతే అతిగా తినడం వలన గ్యాస్ట్రొ-ఇంటస్టైనల్ సమస్యలు సంభవిస్తాయని ఎంత హెచ్చరించినా వినకుండా అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కొనితెచ్చుకుంటున్నారని, ఇది ప్రవక్త చెప్పిన పద్ధతి కాదని అట్లాస్ హాస్పిటల్ వైద్యుడు డా. వి. సి. పి. మొహమ్మద్, KIMS హాస్పిటల్ మెడికల్ సుపరింటెండంట్ శశి రాజ్ తో సహా పలువురు వైద్యులు తెలిపారు.

వారు రమదాన్ ఉపవాస సందర్భంగా పాటించాల్సిన కొన్ని చిట్కాలు ఇలా చెప్పారు:-

1.ఇఫ్తార్ విందును రెండు భాగాలుగా విడదీసి ఆరగించండి; తరువాత పండ్లు వంటివి, చివరగా సుహూర్ ను    తీసుకోండి.

2. ఆహారాన్ని మెల్లిగా నమిలి తినండి.

3. భోజనంతో పాటుగా కాకుండా, తరువాత నీళ్ళు తాగండి.

4. జీర్ణవ్యవస్థకు సహాయపడేలా - కేఫీన్ రహిత హెర్బల్ టీలను సేవించండి.

5.అతిగా కాఫీ, టీ సేవనం వల్ల ఉదర సమస్యలు ఎక్కువౌతాయి.

6. అతిగా కొవ్వు కలిగిన వేపుల్లు, మసాలా పదార్ధాలు, టమాటాసాస్ వంటివి ఉపవాసానంతరం సేవించడం, కడుపు నొప్పికి కారణమౌతుంది.

7. పచ్చి కూరగాయలు వంటివి కడుపు ఉబ్బరానికి కారణమౌతాయి; వాటి బదులుగా ఉడికిన కూరగాయలు తినండి.

8. ఇఫ్తార్ ముగిసిన వెనువెంటనే నిద్ర పోతే, అసిడిటీ పెరిగి కడుపులో అసౌకర్యానికి కారణమౌతుంది.

 

--నూనె లెనిన్ కుమార్(ఒమాన్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com