డ్రైవర్ పై 600,000 దిర్హామ్‌ల కోసం దావా వేసిన వాహనదారుడు..!!

- October 10, 2024 , by Maagulf
డ్రైవర్ పై 600,000 దిర్హామ్‌ల కోసం దావా వేసిన వాహనదారుడు..!!

యూఏఈ: దుబాయ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మోకాలికి తీవ్రంగా గాయపడిన ఓ వాహనదారుడు.. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ నుండి Dh600,000 పరిహారం ఇప్పించాలని కోర్టులో సివిల్ సూట్ వేశారు. ప్రమాదానికి కారణమైన ఆసియా ప్రైవేట్ ట్యాక్సీ డ్రైవర్ తన స్టీరింగ్‌పై నియంత్రణ కోల్పోయి పేవ్‌మెంట్‌పైకి దూసుకెళ్లడంతో అతని వాహనం అదుపుతప్పి బర్ దుబాయ్ పరిసరాల్లో మోటార్‌సైకిల్ నడుపుతున్న మేనేజర్‌ను ఢీకొట్టింది.  అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా వైద్య పరీక్షల్లో కుడి మోకాలికి ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని, కొన్నాళ్లు ఉద్యోగానికి దూరంగా ఉండాల్సి వస్తుందని డాక్టర్లు తెలిపారు.  మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (MRI) ద్వారా రోగి కుడి మోకాలి పార్శ్వ కొలేటరల్ లిగమెంట్ కు గాయం అయిందని, అతడు క్రూసియేట్ లిగమెంట్ కార్టికల్ అవల్షన్ ఫ్రాక్చర్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు నివేదికలు అందజేశారు. ఆసియా డ్రైవర్ అజాగ్రత్త, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదం జరిగిందని, తనకు జరిగిన నష్టానికి పరిహారం ఇప్పించాలని వాహనదారుడు కోర్టులో సివిల్ దావా వేశారు.  అంతకుముందు దుబాయ్ ట్రాఫిక్ కోర్టు నిందితుడిని దోషిగా నిర్ధారించింది. న్యాయమూర్తి ముందు నేరాన్ని అంగీకరించడంతో అతనికి 4,000 దిర్హామ్‌లు జరిమానా విధించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com