భారత్‌-ఆసియాన్ స్నేహం చాలా ముఖ్యం: ప్రధాని మోదీ

- October 10, 2024 , by Maagulf
భారత్‌-ఆసియాన్ స్నేహం చాలా ముఖ్యం: ప్రధాని మోదీ

వియంటైన్: 21వ శతాబ్దం భారతదేశం, ఆసియాన్ దేశాల శతాబ్దంగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు.ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలు ఘర్షణలు, ఉద్రిక్తతలు ఎదుర్కొంటున్న సమయంలో భారతదేశం-ఆసియాన్ స్నేహం ముఖ్యమైనదని అన్నారు.

వచ్చే 2025వ ఏడాది ఆసియాన్-భారత పర్యాటక సంవత్సరమని తెలిపారు. లావోస్‌ వేదికగా 21వ 'ఆసియాన్- ఇండియా సమ్మిట్‌'లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం పాల్గొని మాట్లాడారు.

'' 10 సంవత్సరాల క్రితం యాక్ట్ ఈస్ట్ పాలసీని ప్రకటించాం.గత దశాబ్దంలో ఇది భారతదేశం, ఆసియాన్ దేశాల మధ్య చారిత్రాత్మక సంబంధాలకు కొత్త శక్తిని, దిశను, వేగాన్ని ఇచ్చింది. పొరుగు దేశాలుగా, భాగస్వాములుగా.. మనం శాంతి, ప్రేమిగల దేశాలం. ఒకరి జాతీయ సమగ్రత, సార్వభౌమత్వాన్ని గౌరవిస్తాం.ఈ ప్రాంత యువత ఉజ్వల భవిష్యత్తుకు కట్టుబడి ఉన్నాం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com