ఏపీ మద్యం షాప్‌ల లైసెన్స్ కోసం విదేశాల నుంచి దరఖాస్తులు..
- October 10, 2024
అమరావతి: ఏపీలో మద్యం షాపులకు విదేశాల నుంచి దరఖాస్తులు వస్తున్నాయి. యూరప్, అమెరికా నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు నమోదయ్యాయి. అమెరికా నుంచి 20 అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మద్యం షాపుల టెండర్లకు సంబంధించి దరఖాస్తు గడువు సమీపిస్తోంది. ఈ క్రమంలో ఎక్కువ మంది దరఖాస్తులు వేస్తున్నారు. ఇప్పటివరకు 70వేలకు పైగా టెండర్లు వచ్చినట్లుగా తెలుస్తోంది. దాదాపుగా 1500 కోట్ల రూపాయలకుపైగా డిపాజిట్లు వచ్చినట్లుగా సమాచారం. ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇంకా దరఖాస్తులకు 24 గంటల సమయం ఉంది. 14వ తేదీన టెండర్లు ఓపెన్ చేస్తారు. మద్యం షాపుల టెండర్లకు సంబంధించి విదేశాల నుంచి కూడా అప్లికేషన్లు వచ్చాయి. ఒక్క అమెరికా నుంచే దాదాపుగా 20కి పైగా దరఖాస్తులు వచ్చినట్లుగా తెలుస్తోంది. యూరప్ నుంచి కూడా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు పెడుతున్నారు. రేపు రాత్రి వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారు. 14వ తేదీన టెండర్లు ఓపెన్ చేస్తారు. లాటరీ విధానం ద్వారా మద్యం షాపులు కేటాయిస్తారు. 16వ తేదీ నుంచి ఏపీలో కొత్త మద్యం షాపులు ప్రారంభం కానున్నాయి.
కొత్త షాపులు, కొత్త బ్రాండ్లు, కొత్త ధరలు, కొత్త మద్యం, కొత్త విధానం రాబోతోంది. మొత్తం మీద ప్రభుత్వం అనుకున్నదానికంటే కూడా ఎక్కువ రెస్పాన్స్ ఉంది. ఒక్కో షాప్ కి రూ.2లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అది నాన్ రీఫండబుల్ అమౌంట్. ఆ లెక్కన ఇప్పటివరకు 1500 కోట్ల రూపాయల వరకు అమౌంట్ వచ్చింది.
తాజా వార్తలు
- ఐపీఎల్ 2026..SRH పూర్తి జట్టు ఇదే..
- బ్రౌజింగ్ ప్రపంచంలో గూగుల్ క్రోమ్ అగ్రస్థానం
- ఏపీలో ఎయిర్పోర్ట్ అభివృద్ధి పై కేంద్రం శుభవార్త
- IPL మెగా ఆక్షన్: 2025లో అత్యంత ఖరీదైన ఆటగాళ్ల పూర్తి జాబితా..
- వరల్డ్ కప్ విజేతలకు విశాఖలో స్వాగతం..
- ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన టాప్-6 ఆటగాళ్లు వీరే!
- జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి
- మెడికవర్ హాస్పిటల్స్ లో 'న్యూరో స్టెంటింగ్' ద్వారా 69 ఏళ్ళ మహిళ కొత్త జీవితం
- చంద్రబాబు పాలనపై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్..
- బహ్రెయిన్ లో సివిల్ డిఫెన్స్ సేఫ్టీ క్యాంపెయిన్ ప్రారంభం..!!







