కార్లు, బంగ్లాల కోసం మేం పాలిటిక్స్ చేయం: ఆతిశీ

- October 11, 2024 , by Maagulf
కార్లు, బంగ్లాల కోసం మేం పాలిటిక్స్ చేయం: ఆతిశీ

న్యూ ఢిల్లీ: ఢిల్లీలోని బీజేపీ నేతలు ఆప్ నేతలను లక్ష్యంగా చేసుకుని రాజకీయంగా పలు ఆరోపణలు చేశారు.ఈ ఆరోపణలను ఖండిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ బిజెపి నేతలకు గట్టి కౌంటర్ ఇచ్చారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమె మీడియాతో  మాట్లాడుతూ.. “కార్లు, బంగ్లాల కోసం మేం పాలిటిక్స్ చేయం” అని ఆమె బిజెపి నేతలకు సూచించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మరియు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మధ్య జరుగుతున్న మాటల యుద్ధంలో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆతిశీ ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం, బీజేపీ ఆప్ నేతలను లక్ష్యంగా చేసుకుని ఆప్ నేతలు అధికారిక నివాసాలను దుర్వినియోగం చేస్తున్నారని బిజెపి నేతలు ఆరోపించారు. దీనికి ప్రతిస్పందనగా, ఆతిశీ, ఆప్ నేతలు కార్లు, బంగ్లాల కోసం రాజకీయాలు చేయరని, అవసరమైతే వీధుల్లో నుంచే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆమె బిజెపి నేతలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఇంకా ఆప్ పార్టీకి ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉందని, ఓట్ల కోసం బీజేపీ చేసే ప్రయత్నాలు విఫలమవుతాయని ఆతిశీ తెలిపారు.

--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com