రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నటుడు షాయాజీ షిండే
- October 11, 2024
ముంబై: ప్రముఖ నటుడు షియాజీ షిండే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.ఆయన మహారాష్ట్రలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో చేరారు.ఈ కార్యక్రమం ముంబైలో జరిగింది.ఎన్‌సీపీ చీఫ్ మరియు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. ఈయన ఒక భారతీయ సినీ నటుడు. ఎక్కువగా తెలుగు సినిమాలలో నటించాడు. ఇతను జన్మతః మహారాష్ట్రకు చెందిన వ్యక్తి.
షిండే మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టాడు. డిగ్రీ తరువాత మహారాష్ట్ర గవర్నమెంట్ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్లో వాచ్‌మెన్‌గా పనిచేసిన షిండే ఒక పెద్దాయన ఇచ్చిన సలహాతో వ్యాయామం, యోగా అలవాటు చేసుకుని దేహధారుడ్యాన్ని పెంపొందించుకుని సినిమాల్లోకి అడుగు పెట్టారు.
షిండే రాజకీయాల్లోకి రావడం వెనుక ప్రధాన కారణం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం. ఆయన రాజకీయాల్లోకి రావడం ద్వారా మహారాష్ట్రలోని ప్రజలకు మరింత సేవ చేయగలరని ఆశిస్తున్నట్లు అజిత్ పవా ర్ తెలిపారు. మహారాష్ట్రలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో షాయాజీ షిండే కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ వార్త షాయాజీ షిండే అభిమానులో మరియు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.
సినిమాల్లో వైవిధ్యమైన పాత్రల్లో గొప్పగా రాణించిన షాయాజీ షిండే రాజకీయాల్లోకి రావడం ద్వారా ఆయన జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఆయన రాజకీయాల్లో ఎంతవరకు విజయవంతం అవుతారో చూడాలి.
--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







