స్టోర్ లో చోరీ..అడ్డుకున్న సిబ్బందిపై దాడి.. 40ఏళ్ల వ్యక్తికి జైలుశిక్ష..!!

- October 12, 2024 , by Maagulf
స్టోర్ లో చోరీ..అడ్డుకున్న సిబ్బందిపై దాడి.. 40ఏళ్ల వ్యక్తికి జైలుశిక్ష..!!

మనామా: పవర్ డ్రిల్‌ను దొంగిలించి, స్టోర్ ఉద్యోగిపై దాడి చేసినందుకు 40 ఏళ్ల వ్యక్తికి జైలు శిక్షను విధించారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితుడిపై బెదిరింపులు, దాడి ద్వారా దొంగతనం చేసినట్లు అభియోగాలు మోపింది. ఈ కేసును పరిష్కరించడానికి దిగువ క్రిమినల్ కోర్టులో అక్టోబర్ 14న విచారణ జరగనుంది. ఎలక్ట్రికల్ వస్తువుల దుకాణంలో ఈ సంఘటన జరిగింది. నిందితుడు వస్తువులకు బిల్ చెల్లించకుండా వెళ్లిపోతుండగా.. అడిగిన పాపానికి దాడికి పాల్పడ్డాడు అని స్టోర్ కీపర్ వివరించారు. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com