ఇరాన్ నుంచి యూఏఈకి మారిన వరల్డ్ కప్ మ్యాచ్..!!

- October 12, 2024 , by Maagulf
ఇరాన్ నుంచి యూఏఈకి మారిన వరల్డ్ కప్ మ్యాచ్..!!

యూఏఈ: భద్రతా కారణాల దృష్ట్యా ఇరాన్ - ఖతార్ మధ్య ఫుట్‌బాల్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ యూఏఈలోని తటస్థ వేదికకు మార్పు చేశారు.  ఈ మేరకు ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ (AFC) తెలిపింది. ఫిఫా, ఇతర సంబంధిత వాటాదారులతో సంప్రదించిన తర్వాత వేదికను మార్చాలనే నిర్ణయం తీసుకున్నట్లు AFC తెలిపింది.  ఇరాన్ ఈ నెలలో ఇజ్రాయెల్‌పై దాదాపు 180 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. వెంటనే, ఇజ్రాయెల్ ఇరాన్ పై ప్రతిదాడికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com